బెంగళూరులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా ఒకరికి ఒకరు పరిచయమైన జాన్సన్ అలియాస్ నాగరాజ్ (23), దిల్దాద్ (25) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. దిల్దాద్‌కు ఇప్పటికే పెళ్లి కాగా నాగరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. అయితే, తమ ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించబోరని విరక్తి చెందిన నాగరాజ్ రాచేనహళ్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దిల్దాద్ తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.