పొన్నూరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద పొన్నూరు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 6వ రోజుకి చేరాయి.
ఆదివారం దీక్ష శిబిరంలో మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు శిబిరంలో కూర్చుని మద్దతు తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై పట్టణ పోలీసులు చేసిన అమానుష దాడిని ఖండిస్తూ బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.