గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు తానే సాధించినట్టు చెప్పుకుంటున్నారని, ఇది సిగ్గుచేటు అని వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జగన్‌గారు గత అయిదేళ్లలో గ్రామ స్థాయి నుంచి పాలన మొదలు పెట్టి శాశ్వత నిర్మాణాలతో గ్రామాల్లో సంపద సృష్టిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఏడు నెలల్లోనే గ్రామాలను నిర్వీర్యం చేశారని ఆయన ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అప్పులతో అధోగతి పాలైంది తప్ప ఏ మూలనా అభివృద్ధి కనిపించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయి అప్పుల పాలవుతున్నా అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని కేవలం ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు కనుక రాకపోతే చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఆరోపించారు.