ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నట్లు రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలి పారు. సోమవారం గురవాం లో అంబేడ్కర్‌విగ్రహన్ని ఆవి ష్కరించారు. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితుల నడ్డి విరిచి 27 పథకాలను రద్దు చేసి దగాచేసిందని ఆరో పించారు. వైసీపీ రద్దుచేసిన 27 పథకాలను చంద్రబాబు త్వరలో తిరిగి పునః ప్రారం భిస్తారన్నారు. రాజాం మాదిగవీధికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రి చికిత్స నిమిత్తం తండి ఇలపండు అజయ్‌కుమార్‌కు లక్ష ఆరువేల 127 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్ల అప్పలనాయుడు, కోండ్రు జగదీష్, గట్టి భాను, సుమల మన్మథ రావు, పిన్నింటి మోహన్‌రావు, దూబ ధర్మారావు, దుప్పలపూడి శ్రీను, పొన్నాడ భీమే శ్వరరావు, కోటగిరి నారాయణరావు, పర్లాపు పోలిరాజు పాల్గొన్నారు.