టెక్కలి పరిధిలోని కె.కొత్తూరు సమీపంలో జాతీయరహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దసాన గ్రామానికి చెందిన బందాపు అప్పారావు (50) రోడ్డు పక్క నుంచి వెళ్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ వాహనం ఢీకొని ఈ ప్రమా దం జరిగింది. గాయ పడిన అప్పారావును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిం చినప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.