ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రాకు పోస్టింగ్ ఇవ్వగా.. నంద్యాల ఏఎస్పీగా మందా జావలి ఆల్ఫోన్స్ ను నియమించింది. అలాగే కాకినాడ ఏఎస్పీగా పాటిల్ దేవరాజ్ మనీశ్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్నాథ్ హెగ్డే బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.