చింతపల్లిలో జెట్టీ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు. మంగళగిరిలో జనసేన నాయకుడు లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. విశాఖ నుంచి భీమిలి వరకూ గల బీచ్ రోడ్డును చింతపల్లి వరకూ విస్తరిస్తే కోస్టల్ కారిడార్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు, బాల అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.