తిరుపతిలో పాలనాపరమైన వైఫల్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణిస్తే.. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటానికి వైయస్ఆర్‌సీపీ సిద్ధమైంది. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు. పైగా నిర్లక్ష్యంగా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఎస్పీ సుబ్బరాయుడును కేవలం ట్రాన్స్‌ఫర్‌తోనే సరిపెట్టింది ప్రభుత్వం. దీంతో.. ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఈ పోరాటంపై పార్టీ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.