సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని వైయస్ జగన్ అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని, ఇంకా సంక్రాంతి.. కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని వైయస్ జగన్ అభిలషించారు.