ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల టోల్‌గేట్ వద్ద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తిరువన్నామలై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.