తమ యూనివర్సిటీ ఫీజును రూ.63 వేలుగా ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ కాకినాడ ఆదిత్య వర్సిటీ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యానికి హైకోర్టు విముఖత చూపింది. ఫీజు పునఃపరిశీలన కోసం తిరిగి కమిషన్‌కు పంపించేందుకు నిరాకరించింది. తర్వాత బ్లాక్ పీరియడ్‌కు ఫీజు ఖరారు చేసే సమయంలో వర్సిటీ సమర్పించే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్‌ను ఆదేశించింది. కాలేజీ కొత్తగా యూనివర్సిటీగా మారిన నేపథ్యంలో తగిన సమాచారం లేదని, అందుబాటులో ఉన్న వివరాలతో ఫీజులు ఖరారు చేశామన్న కమిషన్ వాదనతో ఏకీభవిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు.