భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది జరిగిన ఐపీఎల్ మెగావేలం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో తనను ఒక జట్టు కొనుగోలు చేయకూడదని కోరుకున్ననాని, లక్కీగా తాను అనుకున్నట్లుగానే జరిగిందని వెల్లడించాడు. ఆ జట్టు పేరు పంజాబ్ కింగ్స్ అని తెలిపాడు. నిజానికి వేలానికి ముందు పంజాబ్ 112 కోట్లతో హైయస్ట్ పర్స్ మనీతో ఉంది. తను కావాలనుకుంటే ఏ ఆటగాడినైనా కొనుగోలు చేసే లెవల్లో ఉంది. వేలంలో తొలిరోజు శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్లో హైయస్ట్ ఖరీదైన కొనుగలో రికార్డు సాధించింది. పంజాబ్ తర్వాత 82 కోట్లతో మరో ఐపీఎల్ జట్టు రెండోస్థానంలో నిలిచింది. ఇక శ్రేయస్ కొనుగోలు చేసిన తర్వాత పంజాబ్ తనను పర్చేజ్ చేయదని భావించినట్లు తెలిపాడు. అయతే తాను పంజాబ్ తరపున ఎందుకు ఆడకూడదనుకున్నాడో మాత్రం తెలియ పర్చలేదు.