భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు జనవరి 22 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇక, ఆతిథ్య భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా, ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు శనివారం జనవరి 19 కోల్‌కతా చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. కాగా, మూడేళ్ల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి తోడు ఇంగ్లాండ్‌పై టీమిండియా టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో గెలవగా, 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే, కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ప్రపంచ కప్ తర్వాత చెలరేగిపోతోంది. సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, నితీష్ కుమార్ లాంటి హార్డ్ హిట్టర్లతో కూడిన జట్టు మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఇంగ్లీష్ జట్టు కూడా తక్కువేం కాదు అని చెప్పాలి. కోచ్‌గా టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌కు దూకుడు నేర్పి, ఆ జట్టు ఆటను మరో స్థాయికి తీసుకెళ్లిన మెక్‌కలమ్ ఇప్పుడు టీ20లకు కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇక అతడి కోచింగ్‌లో ఎంతలా చెలరేగిపోతోందో మనం అర్థం చేసుకోవాలి. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ లాంటి ప్రమాదకర ప్లేయర్స్ ఆ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టేడియాల్లో ఆ జట్టు ఊచకోతకు దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, ఇరు జట్ల బ్యాటింగ్‌తో స్టేడియాలు ఊగిపోవడంతో పాటు కొత్త రికార్డులు సృష్టించేందుకు ఎదురు చూస్తున్నాయి.
భారత్: సూర్యకుమార్ యాదవ్ (C), సంజు శాంసన్ (W/K), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్ (VC), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమ్మీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (W/K).
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (C), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్.