రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అవినీతిని పక్కా ఆధారాలతో బట్టబయలు చేస్తానని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. మంగళవారం రాజా మీడియాతో మాట్లాడుతూ..రాజానగరం నియోజక వర్గంలో ఎమ్మెల్యే సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అభివృద్ధి కంటే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలను త్వరలో ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు. నియోజక వర్గంలో డ్రగ్స్ దందా, పేకాట క్లబ్ లు ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే యువతను పక్కదారిపట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతి సొమ్ముతో..గాలిలో గెలిచిన ఎమ్మెల్యే బత్తుల త్వరలోనే ప్రజలతో ఛీ కొట్టించుకొంటాడని హెచ్చరించారు.