జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ఎస్‌డీ టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజుకారోజు ఎస్ఎస్‌డీ టోకెన్లను అందించనుంది.
ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే టోకెన్లను పొందవచ్చని అధికారులు తెలిపారు.