సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నడిపిన బస్సుల వల్ల రోజుకు రూ. 20 కోట్లు రికార్డుస్థాయిలో ఆదాయం ( Income) వచ్చింది. ఈనెల 20న ఒక్కరోజే రూ.23. 71 కోట్లు ఆర్జించడం ఏపీ చరిత్రలో ప్రథమమని ఆర్టీసీ ఎండీ,డీజీపీ ద్వారకా తిరుమలరావు (RTC MD Tirumala rao) వెల్లడించారు.సాధారణ ఛార్జీలతోనే ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9 వేల 97 ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆయన తెలిపారు. ఈ సీజన్లో మరో మూడు రోజుల పాటు రోజుకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు వివరించారు. సంక్రాంతి సీజన్ మొత్తంలో ప్రత్యేక బస్సుల ద్వారానే రూ. 21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది.పండగ సీజన్లో మొత్తం 7200 బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించిన ఆర్టీసీ, ప్రయాణికుల రద్దీ వల్ల అంతకన్నా ఎక్కువగా 9097 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వెల్లడించారు.రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు Chandra Babu) ఆదేశాల మేరకు ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల బస్సులను కూడా వివిధ ప్రాంతాల్లో నడిపినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల అంకిత భావం, కృషి ఫలితంగానే ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ ఎండీ ప్రత్యేక దన్యావాదాలు తెలిపారు