కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు చారిత్రక నిర్ణయం అని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం పెనుకొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సవిత మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు 340 మద్యం షాపుల కేటాయిస్తూ జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
మద్యం షాపుల లైసెన్స్ ఫీజులోనూ 50 శాతం రాయితీ ఇవ్వడంపైనా ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.