పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్సైట్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలపై మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
2022 ఏప్రిల్ నుండి 2024 డిసెంబర్ నెల ఆఖరి వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.