ప్రభుత్వ పరంగా అర్హులందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని చీరాల టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రనాథ్ చెప్పారు. వేటపాలెం మండల పరిధిలోని అబ్దుల్ కలామ్ కాలనీ వాసులు పలువురు కొత్తపేటలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద డాక్టర్ మహేంద్రనాథ్‌ను కలిశారు. తమకు సొంతింటి నిర్మాణాలకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతాక్రమంలో సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.