ఉద్యోగులకు బకాయి ఉన్న సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించేందుకు రోడ్డు మ్యాప్ ఇవ్వా లని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేర కు బుధవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో కె.హేమలతకు యూటీఎఫ్ నాయకు లు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జూలై 2023 నుంచి అమలు కావల్సిన 12వ పీఆర్సీ కోసం పీఆర్సీ కమిషనర్ నియామకం పునరుద్ధరించాలని కోరారు. వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్, ఏపీజీ ఎల్ఐ, డీఏ, పీఆర్సీ బకాయిలు సుమారు రూ.20వేల కోట్లు విడుదలకు తగిన రోడ్డు మ్యాప్ ఇవ్వాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట రమేష్, ప్రధాన కార్యదర్శి కుర్రా భాస్కరరావు, నాయకులు వి.జ్యోతి, ఎన్.శ్రీనివాసరావు, పి.వెంకటనాయుడు పాల్గొన్నారు.