కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదికలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను గురువారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రజా వేదికలో లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. మెగా రక్తదానం శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని రక్త దాతలను పేరుపేరున పలకరించి మరింత ఉత్సాహాన్ని నింపారు. మహిళలకు చీరలను పంచిపెట్టారు.