శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచార కార్యకలాపాలు హైటెక్ పద్దతులలో కొనసాగుతున్నాయి. వ్యభిచార గృహాల నిర్వాహకులు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు పని కానిచ్చేస్తున్నారు.సెల్ఫోన్లు, వాట్సాప్లు వినియోగించుకుంటూ విటులను ఆకర్షిస్తున్నారు. విచ్చలవడిగా బిజినెస్ రన్ చేస్తున్నారు.శ్రీకాకుళంతో పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వారికి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారు. వారికి అధికంగా డబ్బులు ఆశ చూపించి ఈ వృత్తిలో దించుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా దాటి ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
విలాసాలకు అలవాటు పడిన కొందరు యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. అలా ఈ వృత్తిలోకి దిగుతున్న వారు ఇతరులను సైతం ఈ కూపంలోకి లాగుతున్నారు. శ్రీకాకుళం నగర శివారు కాలనీలలోనే కాకుండా నగరం మధ్యలో ఉండే పలు వీధుల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే వెంటనే మకాం మార్చేస్తున్నారు.
విద్యుత్ షాక్తో ప్రాణం పోయిందా? రియల్ ఎస్టేట్ మింగేసిందా? పలాస వ్యక్తి హత్యలో అనేక అనుమానాలు
నగరంలోని పలు లాడ్జీల్లో కూడా వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులో ఉన్న ఓ లాడ్జీలో పోలీసులు తనిఖీలు చేస్తే ఈ బాగోతం బయటపడింది. మేజర్లమని కొందరు సరదాగా గడపడానికి వచ్చామని మరికొందరు పోలీసులకు సమాధానాలు చెప్పేసరికి వారి విని షాక్ అయ్యారు. అరసవల్లి సమీపంలోని ఆదిత్యనగర్ కాలనీలో ఓ ఇంటిలో కొందర్ని పట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఇవి రెండు సంఘటనలు కేవలం పోలీసుల తనిఖీలు, ఫిర్యాదుతో వెలుగు చూసిన బాగోతాలే. వెలుగులోకి రాకుండా గుట్టుచప్పుడు కాకుండా శ్రీకాకుళంలో వ్యభిచార గృహాలు ఎన్నో కొనసాగుతున్నాయన్న చర్చ బహిరంగంగానే సాగుతుంది. శ్రీకాకుళంలోని బలగ, అరసవల్లి, పాతశ్రీకాకుళం, పి.ఎన్ కాలనీ, కిల్లిపాలెం, చాపురం పంచాయతీ పరిధిలో ఉండే నగర శివారు కాలనీలతోపాటు పలు వీధుల్లో వివిధ ఇళ్లు, ఫ్లాట్లలో వ్యభిచారం గుట్టుగా సాగిపోతుందట.
వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా నిత్యం అమ్మాయిల ఫోటోలు పంపిస్తూ బేరసారాలను సాగిస్తున్నారు. యువతులు నచ్చిన విటులు వారు చెప్పే సమయానికి ఆయా ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. కొంతమందిని వ్యభిచార కార్యకలాపాలకి కూడా బ్రోకర్లుగా నిర్వాహకులు వినియోగించుకుంటున్నారు. గృహాలును, ప్లాట్లను, పలు లాడ్జీలను అడ్డాగా చేసుకుని హైటెక్ పద్దతుల్లో దందా సాగిస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో భయం లేకుండా పోతోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలను ఇక్కడకు రప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు యువతులను నిర్వాహకులు మారుస్తూ ఉంటారట. ఆయా గృహాల్లో ప్రత్యేకంగా యువతులకి వసతులు కల్పిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా అనుమానం రాకుండా కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఆయా గృహాల్లో మద్యం సేవించేందుకు, విందు భోజనాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్. పోలీసులు నిఘా పెట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని శ్రీకాకుళం ప్రజలు వేడుకుంటున్నారు.