కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో వచ్చిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి బ్రిటన్‌లో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇందిరా గాంధీ హయాంలో అత్యయిక పరిస్థితి ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. అయితే బ్రిటన్‌లో ఈ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యాయి.ఈ అంశంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ఎమర్జెన్సీ సినిమాను పలు థియేటర్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. భారత వ్యతిరేక మూకల నుంచి వచ్చే బెదిరింపులు, హింసాత్మక నిరసనల వంటి అంశాలను తాము ఎప్పటికప్పుడు యూకే ప్రభుత్వం వద్ద లేవనెత్తుతున్నట్లు చెప్పారు.ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. యూకే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దౌత్య కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని గమనిస్తున్నామన్నారు.