శాంసంగ్ గెలాక్సీ ఎస్25 లాంచ్ అయిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్24 ధర భారీగా దిగొచ్చింది. ఈ మోడల్‌పై అమెజాన్‌లో అతి భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.ఫలితంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా (టైటానియం వయొలెట్) 256 జీబీ మోడల్ ధర రూ. 1,29,999 గా ఉండేది. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో ఇది రూ .99,390 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే దాదాపు రూ .30,000 తక్కువ. ఇక క్రెడిట్ కార్డ్ ఆఫర్లను కలపడం ద్వారా మీరు మరింత మెరుగైన డీల్ పొందవచ్చు! మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. 5% క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. ఇది సుమారు రూ .4,970 వరకు ధరను తగ్గిస్తుంది. దీంతో మొత్తం ధర రూ.94,420కు దిగొస్తుంది. ఇది వాస్తవ ఎంఆర్పీ కంటే సుమారు రూ.35,000 తక్కువ.
ఎస్25 అల్ట్రా లాంచ్ తర్వాత.. ఎస్24 అల్ట్రా కొనుగోలు చేయొచ్చా?
ప్రస్తుతం సుమారు రూ.95,000 ధరకు లభ్యమవుతున్న ఎస్24 అల్ట్రా కంటే ఎస్25 అల్ట్రా ఖరీదైనది. కానీ మీరు అదనపు డబ్బును ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఎస్ 25 అల్ట్రా మంచి ఆప్షన్ అవుతుంది. ఇది అనేక గుర్తించదగిన అప్గ్రేడ్స్ని అందిస్తుంది, ముఖ్యంగా దాని డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రౌండ్ ఎడ్జెస్ దీనిని మరింత ఎర్గోనామిక్ చేస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఉపయోగం కోసం ఇది బెస్ట్.
గెలాక్సీ ఎస్25 స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్‌ని కూడా పొందుతుంది. ఇది కంపెనీ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇంకా, శాంసంగ్ ఎస్25 అల్ట్రా వర్చువల్ అపర్చర్, గెలాక్సీ లాగ్, మెరుగైన సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక కొత్త కెమెరా-సెంట్రిక్, ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లను అందిస్తోంది.
మీరు ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ బాక్సీ డిజైన్, షార్ప్ ఎడ్జెస్ని ఇష్టపడితే, ఇది మీకు సరైన ఎంపిక కావచ్చు. శాంసంగ్ ఏడేళ్ల అప్డేట్స్ని హామీ ఇస్తోంది! ఇది టైటానియం బిల్డ్‌ని కలిగి ఉంది. కొత్త 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ మినహా క్వాడ్-కెమెరా సెటప్‌తో కెమెరా సెటప్ కూడా పెద్దగా మారలేదు.ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..