కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో 10 మంది వాణిజ్య, పరిశ్రమల విభాగానికి చెందిన దిగ్గజాలు ఉన్నారు. వీరిలో అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, భారత్‌లో వాహన పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు కృషి చేసిన ఒసాము సుజుకీ (94) ఉన్నారు. మరణానంతరం ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. జపాన్‌కు చెందిన వాహన సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఆయన. భారత ప్రభుత్వంతో కలిసి మన దేశంలో మారుతీ సుజుకీ సంస్థను స్థాపించారు. ఇప్పుడు ఆ సంస్థ దేశంలోనే అగ్రగామి వాహన సంస్థగా ఎదిగింది. 1981 సమయంలో ఓసాము తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ సంస్థ ఆవిర్భావానికి కారణంగా చెబుతారు. 2007లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థ నుంచి భారత ప్రభుత్వం వైదొలిగింది. దీంతో సుజుకీ మోటార్ మెజార్టీ వాటా దక్కించుకుంది. మారుతీ సుజుకీ ఇండియా పేరు మార్చి సేవలందిస్తున్నారు. గత శనివారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒసాము సుజుకీకి పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది కేంద్రం.
ఇక నల్లి సిల్క్స్ అధినేత కుప్పుస్వామి చెట్టికి పద్మ భూషణ్ ప్రకటించింది కేంద్రం. 1958 నుంచి నల్లి సిల్క్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. 2000లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, 2003లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించాయి. ఆయన 1940లో కాంచీపురంలో పద్మశాలీ కుటుంబలో జన్మించారు. భారత పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేశారని చెప్పవచ్చు. ఇక పారిశ్రమక రంగంలో మరో వ్యక్తికి పద్మ భూషణ్ లభించింది. ఆయనే జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్ పంకజ్ పటేల్. ప్రస్తుతం ప్రపంచ 100 మంది ధనవంతుల్లో ఒకరిగా 24వ ర్యాంకులో కొనసాగుతున్నారు. విటమిన్ల తయారీ కోసం 1952లో ఆయన తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్ కేర్‌లో 1976లో చేరి ప్రస్తుతం ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పద్మ శ్రీ అందుకున్న వాణిజ్య దిగ్గజాల్లో అరుంధతీ భట్టాచార్య ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1977లో పీఓగా చేరి 2013లో ఆ బ్యాంకు ఛైర్ పర్సన్‌గానూ సేవలందించారు. ఎస్‌బీఐ తొలి మహిళా ఛైర్ పర్సన్‌గానూ రికార్డ్ సృష్టించారు. మరోవైపు.. పద్మ శ్రీ అందుకున్న పారిశ్రామిక దిగ్గజాల్లో పవన్ గోయెంకా ఉన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎండీగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం భారత్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్‌స్పేస్ ఛైర్మన్‌గా ఉన్నారు. పద్మ శ్రీ అవార్డు అందుకున్న మిగిలిన వారిలో ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), ప్రశాంత్ ప్రకాస్ (యాక్సెల్ పార్ట్నర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్), సాలీ హెల్కర్ (రేష్వా సొసైటీ), సజ్జన్ భజంకా (సెంచురీ ఫ్లైబోర్డ్స్)