బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ శాంతించాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 75 వేల 550 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 82 వేల 420 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి రేటు సైతం క్రితం రోజు రూ.1000 పెరిగి రూ.1,05,000 వద్దకు పెరిగి ఇవాళ అదే రేటు వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి.