చంద్రబాబు ప్రకటనలో మోసం ,దగా , వంచన స్పష్టంగా కనిపిస్తున్నాయి అని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. అయన మాట్లాడుతూ.... రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో మోసం చేశావ్. 2024 ఎన్నికల్లో ఏపీ శ్రీలంక అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గొంతు చించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోలేదు. గద్దెనెక్కిన దగ్గర్నుంచి వైఎస్ జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.
జీడీపీ 15 శాతం కంటే ఎక్కువ ఉంటేనే సంక్షేమం ఇస్తామంటున్నారు . పథకాలివ్వాలంటే ఎనిమిది తొమ్మిదేళ్లు పడుతుందంటున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల ముందు తెలియదా ఏపీ ఆర్ధిక పరిస్థితి. మా పథకాన్ని కాపీకొట్టి తల్లికి వందనం 15 వేలు ఇస్తామన్నారు..చేతులెత్తేశారు. 54 లక్షల మంది రైతన్నలను మోసం చేశారు. 18 వేలు ఇస్తామని కోటి 80 లక్షల మంది మహిళలను మోసం చేశారు. కోటి మంది నిరుద్యోగులను దగా చేశారు. బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు ముసలమ్మ సరిపోతుందన్నారు.
అమరావతి పేరుమీద వేల కోట్లు అప్పులు చేయడానికి మీరే కావాలా?పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయడానికి మీ కూటమి అవసరమా?ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. జగన్ హయాంలో ఏపీలో పేదరికం 11.5 నుంచి 6శాతంకు తగ్గిందని నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ గణాంకాలకు ఏం సమాధానం చెబుతావ్ చంద్రబాబు ?ఈ ఏడు నెలల్లో తెచ్చిన లక్ష కోట్లకు పైగా అప్పు సొమ్మును ఏంచేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.