మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించారు. అక్కడ సర్వధర్మ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. బాపూజీ ఆదర్శాలు అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయని సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రధాని మోడీ పోస్టు చేశారు. దేశం కోసం అమరవీరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాజ్‌ఘాట్‌లోని గాంధీ మెమోరియల్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు.
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సహా రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.