కుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తాయి. సోమవారం ఉభయ సభలు ప్రారంభం అయిన వెంటనే పెద్దఎత్తున నిరనసలు చేపట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను లోక్సభ స్పీకర్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు.