ఇచ్చాపురం మండలంలోని కేదారి పురం ప్రాథమికొన్నత పాఠశాలలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ, మహేష్ నాయక్, పూజారి రమణ మూర్తి, చింతాడ పార్వతీశ్వరరావు, బి. శంకర్రావు, పిట్ట. శంకరరావు, మాలతి పాల్గొన్నారు.