ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ రాజ్యసభలో అన్నారు. అయన మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారుఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. ఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు. నా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండి. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు అని తెలిపారు.