మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఎంపీ నందిగాం సురేష్ కలిశారు. జైల్‌కు వెళ్లిన నందిగం సురేష్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో వైయస్ జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు.అలానే .... తాడేపల్లి శ్రీ ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎమ్.డి, వైయస్ఆర్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ హాజరయ్యారు. కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్య ప్రతాప్ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.