ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాక్‌ పాయింట్‌లో ఇసుక అందుబాటులో వుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 11:52 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవు. తీపర్రు–2 రీచ్‌ నుంచి ఇసుకను తెచ్చి ఆచంట, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, నరసాపురం, తణుకు, ఉండిలలో ఏర్పాటు చేసిన స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేసి ప్రైవేటు ఏజెన్సీల ద్వారా విక్రయిస్తున్నాం. ఇసుక కావాల్సిన వారు వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని స్టాక్‌ నుంచి పొందవచ్చు. లేదా నేరుగా వెళ్లి ఆధార్‌ కార్డు చూపించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, డిజిటల్‌ పేమెంట్‌ చేసి ఇసుక తెచ్చుకోవచ్చు’ అని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.ఆచంట స్టాక్‌ పాయింట్‌లో 200 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో వుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.295 చెల్లించి పొంద వచ్చు. కేవీవీఎస్‌ఎన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమి టెడ్‌ సంస్థ అమ్మకాలు సాగిస్తుంది. ఇన్‌చా ర్జిల సెల్‌ నెంబర్లు 95506 28544, 939118 11436.పాలకొల్లులో 220 మెట్రిక్‌ టన్నులు వుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.320 చెల్లించి పొందవచ్చు. మైత్రి ఇన్‌ఫ్రా అమ్మ కాలు సాగిస్తుంది. సెల్‌ నెంబర్లు 99892 41197, 91771 15571.


తాడేపల్లిగూడెం పాయింట్‌లో 100 మెట్రిక్‌ టన్నులు వుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.300 చెల్లించి ఇసుక పొంద వచ్చు. శ్రీ దుర్గా కన్‌స్ట్రక్షన్స్‌ అమ్మకాలు సాగిస్తుంది. సెల్‌ఫోన్‌ నెంబర్లు 63030 25769, 82472 30369.తణుకులో 20 మెట్రిక్‌ టన్నులు వుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.215 చెల్లించి ఇసుక పొందవచ్చు. శ్రీ వర్ధన్‌ కనస్ట్రక్షన్స్‌ అమ్మకా లు సాగిస్తుంది. సెల్‌ ఫోన్‌ నెంబర్లు 86888 18124, 93900 69686.నరసాపురంలో 200 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో వుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.370 చెల్లించి పొందవచ్చు. మైత్రి ఇన్‌ ఫ్రా అమ్మకాలు సాగిస్తుంది. సెల్‌ నెంబర్లు 88972 37839, 93467 12492.ఉండి పాయింట్‌లో 200 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో వుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.440 చెల్లించి ఇసుకను పొందవచ్చు. మైత్రి ఇన్‌ఫ్రా అమ్మకాలు సాగిస్తుంది. ఫోన్‌ నెంబర్లు 95152 30498, 94929 39276.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com