తాళ్లపూడి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ తనిఖీల నిమిత్తం విచ్చేసినట్టు జిల్లా పరిషత్ సీఈవో కేఎస్‌ఎస్ సుబ్బారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పాథమిక పాఠశాలల నిర్వ హణ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటే శ్వరరావు తెలిపిన విషయం మేరకు రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా కలిగించే సౌకర్యాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు మండలం లోని సీడబ్ల్యూపి స్కీం ద్వారా తాగునీటి సరఫరా విషయమై కూడా మండలానికి విచ్చేసినట్టు సుబ్బారావు పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎంపీ డీవో టీబీవీ రమణ, ఎంఈవోలు బాలామణి, నెహ్రూజీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయితీరాజ్ ఈవోపీఆర్డీ వీరన్న, పలు శాఖల అధికారులతో జడ్పీ సీఈవో సమీక్షించారు.