కేంద్ర బడ్జెట్‌లో దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతం నుంచి 100 శాతం పెంచడానికి చేసిన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌జె.మాథ్యూస్ డిమాండ్ చేశారు. యూనియన్ పిలుపు మేరకు రాజమహేంద్రవరం ఎల్‌ఐసీ డివిజనల్ ఆఫీసు వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ప్రతిపాదనలను అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. తక్షణమే ఉప సంహరించాలని కోరారు.
నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడుల వల్ల బీమా కంపెనీలు పూర్తిగా విదేశీ సంస్థల అధీనంలో నడిచే ప్రమా దం ఉందన్నారు. దీని వల్ల మోసాలు జరుగుతా యన్నారు. ఇది భారత దేశంలోని పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగిస్తుందని తెలిపారు. ఎల్‌ఐసీ సంస్థను మరింత బలోపేతం చేసి బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదన విరమించుకోవాలన్నా రు.ఈ కార్యక్రమంలో యూనియన్ జాయింట్ సెక్రటరీ పీఎస్‌ఎన్.రాజు, ఉపాధ్యక్షుడు సీ హెచ్.సత్యదేవ, జి.శ్రీనివాస్, కోశాధికారి వి.ఈ శ్వరరావు, డివిజనల్ నాయకులు పాల్గొన్నారు.