ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లాలోని సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ నిధుల నుండి స్టడీ మెటీరియల్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. విద్యార్థులు చక్కగా చదివి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.