ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు ఆర్థిక కమిటీలకు చైర్మన్లను ఖరారు చేస్తూ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. జనసేనకు చెందిన పులపర్తి రామాంజనేయులు ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) చైర్మన్గా నియమితులుకాగా... టీడీపీకి చెందిన కూన రవికుమార్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ (పీఎస్యూసీ) చైర్మన్గా, అదే పార్టీకి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. మంగళవారం ఈమేరకు నోటిఫికేషన్ విడుదలైంది. శాసనసభలో వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో పీఏసీ అధికార పార్టీ ఖాతాలో పడింది.