బాల్యం ఆరంభదశ సంరక్షణ, వేంపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ వి. సునీత ఆధ్వర్యంలో మాతృమూర్తులకు అవగాహన కల్పించారు. బుధవారం వేంపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డే నిర్వహించారు. బిడ్డకు 6సంవత్సరాలు వచ్చేసరికి మెదడు 90%మేర అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ సమయంలో బిడ్డ శారీరక ఎదుగుదల చాలా ప్రాముఖ్యత వహిస్తుందన్నారు.