భారత్ - ఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతుండగా, రెండో మ్యాచ్ ఒడిశాలోని కటక్ వేదికగా జరుగుతుంది. అయితే, రెండో వన్డే ఆఫ్ లైన్ టికెట్ల కోసం కటక్ స్టేడియం దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడం కష్టంగా మారి.. పోలీసులు వాటర్ గన్స్ ప్రయోగించాల్సి వచ్చింది.ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. తొలి వన్డే నాగ్‌పూర్ లో జరగనుండగా.. రెండో వన్డే ఒడిశాలోని కటక్ లో ఉన్న బారాబతి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫిబ్రవరి 2 నుంచే ఆన్లైన్లో టికెట్ల అమ్మకం ప్రారంభించారు.అలా గంటల తరబడి చూసినా టికెట్లు పొందలేని వాళ్ల కోసం ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మరోసారి ఫిజికల్ టికెట్ల అమ్మకం చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ మంగళవారం రాత్రి నుంచే ఎగబడ్డారు. బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం టికెట్ల అమ్మకం ప్రారంభం కాగానే ఒక్కసారిగా అభిమానులు స్టేడియం గేటు దగ్గరికి దూసుకొచ్చారు. కొందరు రాత్రంతా స్టేడియం దగ్గరే నిద్రించారు.