బీసీ రుణాల దరఖాస్తు గడువు ఈ నెల 12 వరకు పెంచినట్లు శుక్రవారం మంత్రి సవిత పేర్కొన్నారు. విజయవాడలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని తెలిపారు.
ఈ మేరకు దరఖాస్తు గడువు ఈ నెల 12వరకు పెంచామని మంత్రి తెలిపారు. గడువు పెంపు సమాచారాన్ని జిల్లాలకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.