తాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. తన పార్టీని విడిచి వెళ్లినవారి గురించి స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారంతా వరుసగా జగన్ కు కౌంటర్లు వేసేస్తున్నారు.
విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జగన్‌కు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మరో మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఇందులో భాగంగా.. తాను ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగే వ్యక్తినైతే కాదని.. అలాంటి వ్యక్తినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునేవాడిని కాదని అన్నారు.