దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీ కార్ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు.. ట్రయల్ కోర్టు కొన్నాళ్ల క్రితమే జీవిత ఖైదు విధించగా దానిపై పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. దోషికి జీవిత ఖైదుకు బదులుగా మరణ శిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అలాగే సీబీఐ కూడా ఇదే తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. అయితే ఈ రెండింటిపై స్పందించిన న్యాయస్థానం.. సర్కారు చేసిన అప్పీల్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. అలాగే సీబీఐ వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు అంగీకరించింది.
సీబీఐకి మాత్రమే ఆ హక్కు ఉంది.. ప్రభుత్వానికి లేదు
ముఖ్యంగా ఈ కేసులో దోషి అయిన సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించాలని కోరే హక్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. కేవలం ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐకి మాత్రమే దోషికి మరణ శిక్ష విధించాలని కోరే హక్కు ఉంటుందని దేవాంగ్షు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్‌పై సుప్రీం కోర్టు
మరోవైపు ఈ కేసును పునర్విచారణ జరపాలని కోరుతూ.. బాధితురాలు తల్లిదండ్రులు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించ లేదు. దీనిపై మార్చి 17వ తేదీన విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.
నార్త్ కోల్‌కతాలోని ఆర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రైనీ వైద్యురాలిపై గతేడాది ఆగస్టు 9వ తేదీన హత్యాచారం జరిగింది. వైద్యురాలు ఆస్పత్రిలో ఉండగానే.. ఇంత దారుణానికి పాల్పడడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు డిసెంబర్ 10వ తేదీనే దోషి సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు.
ఈక్రమంలోనే విచారణ జరిపిన సీబీఐ.. బాధితురాలి మృతదేహంపై అనేక మంది డీఎన్ఏ దొరికినా.. ఛార్జీషీట్లో మాత్రం సంజయ్ రాయ్ పేరును మాత్రమే నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. డిసెంబర్ 19వ తేదీన సంజయ్ రాయ్‌ను దోషిగా తేలచ్చింది. ఆ మురసటి రోజే జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
![]() |
![]() |