వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించింది. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.విశాఖ హయగ్రీవ భూముల్లో జరిగిన కుంభకోణాన్ని ఈడీ బట్టబయలు చేసింది. వృద్ధులు, అనాథలకు సేవ చేయడానికి కేటాయించిన భూముల్ని వైకాపా నేతలు అన్యాక్రాంతం చేసినట్టు దర్యాప్తులో తేల్చింది. ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా లాక్కున్నారని గతేడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి.. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు చేపట్టింది.
![]() |
![]() |