దేశ రాజకీయ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అరసవల్లి నగరంలోని అరసవల్లిలో గల ఓ పైవేట్ కల్యాణ మండపంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు రెండో రోజు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా తొలుతు ఏఐవైఎఫ్ అరుణ పతాకాన్ని మాజీ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. గతానికి, నేటికీ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, మతోన్మాద శక్తులు దేశాన్ని అశాంతి నిలయం మార్చేస్తున్నాయని ఆరోపించారు.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గిడిచినా ధనికులు, పేదల మధ్య నేటికీ అంతరం తగ్గలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చైతన్యవంతమైన యువత మరో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డబ్బున్న వారే నాయకులు, మంత్రులుగా చెలామణి అవుతున్నారని, ప్రభుత్వాలు కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లలో రుణమాఫీలు చేసి, సామాన్యుల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి యువతకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం పేరుతో బీజేపీ అజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు ఉన్నా.. రాష్ట్ర విభజన హాలు అమలు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా యువత చైతన్యం పొంది ఐక్య పోరాటాలతో ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఈ రాజకీయ వ్యవస్థను మార్చగలిగే శక్తి యువతకే ఉందన్నారు.
![]() |
![]() |