ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాపారవేత్త, ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్లే ఆప్ ఓడిపోయిందని వాద్రా శనివారం పేర్కొన్నారు.
ఓటింగ్ శాతాన్ని చూస్తే.. చాలా చోట్ల కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. ఫలితాలను బట్టి ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని అర్థమవుతోందన్నారు. బీజేపీతో పోరాడాలంటే ఇండియా కూటమితో కలిసి ఉండాలని వాద్రా హితవు పలికారు.
![]() |
![]() |