అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది... ఇంకా కౌన్సిల్ ప్రక్షాళన మాత్రమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ ఆశోక్ బాబు తెలిపారు. ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న నామినేషన్ ర్యాలీలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానాన్ని ప్రజలు గమనించారని అన్నారు. ఇది కౌరవ సభ రాను.. గౌరవ సభ అయితేనే వస్తానని చంద్రబాబు చెప్పడం.. ఆయనను నమ్మి ప్రజలు 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ముద్దాయిలను, నిందితులను, రౌడీషీటర్లను, మహిళలను అపహస్యం చేసిన వారిని ఎమ్మెల్సీగా నియమించిందని విమర్శించారు. వాళ్లు వినేది లేదు.. చెప్పేది లేదు.. ఎవరైనా మాట్లాడితే మొత్తం అందరూ నిలబడి ఇబ్బందులకు గురి చేయడం తప్ప.. వారు చేసేది ఏమి లేదని చెప్పారు. అసెంబ్లీ ఏ రకంగా ప్రక్షాళన అయిందో.. కౌన్సిల్ కూడా అ రకంగా ప్రక్షాళన జరిగితేనే ప్రభుత్వం సజావుగా సాగుతుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.
![]() |
![]() |