అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ విద్యార్థులు యూనివర్సిటీల నుంచి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే, అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారిలో మనవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతారేమోనని భారత్‌లో వారి తల్లిదండ్రులు కూడా కంగారు పడుతున్నారు. అమెరికా అంటే, మొదటి నుంచి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. రెండేళ్లలో పీజీ పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించవచ్చు అనే నమ్మకం ఉండేది. యూఎస్‌లో ఏదో ఒక యూనివర్సిటీలో సీటు వస్తే.. అక్కడకు వెళ్లి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ.. స్టూడెంట్ లోన్ కట్టేస్తూ.. పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు అనుకునేవాళ్లు. అలాంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. స్టోర్లు, రెస్టారెంట్లలో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు పనిచేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇలా పని చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో.. ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ట్రంప్.. అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టారు. అక్రమ వలసదారులు మీ పరిసరాల్లో ఉంటే ఫిర్యాదు చేయండి అంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సైట్‌లో ఒక ట్యాబ్ పెట్టారు. దీనికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటివరకు 42 వేల మంది అక్రమ వలసదారులను గుర్తించినట్టు సమాచారం.
![]() |
![]() |