నార్పల మండల కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి అనే వివాహిత ఆదివారం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 3న ఆదిలక్ష్మి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.
![]() |
![]() |