ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకు శిక్షణ తరగతులు నిర్వహిస్తు్న్నామని.. వాటికి హాజరు కావాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలీపై ఈ సందర్భంగా స్పందించారు.అసెంబ్లీకి హాజరుకావాలంటూ తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు సూచించానని చెప్పారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా.. తన ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడుతోన్నారన్నారు. అంతేకాదు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడికి ప్రసంగించడానికి ఎంత సమయం ఇస్తున్నారో.. తనకు అంత సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ అంటున్నారని ఇదేమి విచిత్రమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తాము నిర్ణయించామన్నారు. అయితే ఈ లోపే ఎమ్మెల్యేలకు విజయవాడలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు.
![]() |
![]() |