కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా నగర ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి ఆయన పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి ఆయన పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము కోరుతున్నామన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఆమె కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సోమవారం లేఖ రాశారు.వంగవీటి మోహన్ రంగా ప్రజలకు చేసిన సేవలు అనిర్వచనీయమని వైఎస్ షర్మిల అభివర్ణించారు. సామాజిక న్యాయంపై దృష్టి సారించి.. అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన వాదించారని ఆమె పేర్కొన్నారు.
భూమి లేని వారికి భూ పంపిణీ చేసి.. ప్రజల గుండెల్లో రంగా చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా అని వైఎస్ షర్మిల అభివర్ణించారు.ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి "వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారిగా పేరు పెట్టాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలంటూ సీఎం చంద్రబాబును రాసిన లేఖలో ఆమెను కోరారు.
![]() |
![]() |